Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Apr-2016 12:25:06
facebook Twitter Googleplus
Photo

తొందరపడి ఓ కోయిల ముందే కూసిందే అనేది సామెత. అయితే ఇప్పుడు అచ్చు గుద్దినట్లు ఆ సామెతకు ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పీర్జాదా. అమ్మడు నాని సినిమా ''కృష్ణగాడి వీర ప్రేమగాధ''తో ఇక్కడ పరిచయమైంది. అయితే మరీ తొలి సినిమా చూసి ఈమెకు పిలిచి ఓ డజను సినిమాలు చేతిలో పెట్టేంత క్రేజ్ ఏమీ రాలేదు. కాని సాయిధరమ్ తేజ్ సరసన ఓ సినిమా నటించడానికి ఛాన్సొచ్చింది. ఇక విషయానికి వెళదాం.

మామూలుగా కొంతమంది స్టార్ హీరోయిన్లు.. ఏదైనా ఐటం సాంగ్ చేస్తున్నరాని రూమర్ వచ్చినప్పుడో.. లేదంటే మహేష్ బాబు సరసన నటిస్తున్నారని ఏవైనా గాసిప్పులు వచ్చినప్పుడో.. స్పందిస్తుంటారు. కాని మెహ్రీన్మాత్రం.. రాజ్ తరుణ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కనున్న "శతమానం భవతి" చిత్రంలో కథానాయికగా నటించట్లేదు.. అంటూ ఏకంగా ఒక ప్రెస్ నోట్ పంపింది. అసలు తనను ఆ సినిమా గురించి ఎవరూ ఎంక్వైరీ కూడా చేయలేదంటూ పేర్కొంది. ఇప్పుడు సడన్ గా అంత క్లారిటీ ఇచ్చేసేంతగా ఈమెపై ఏం రూమర్లు వచ్చేశాయో తెలియదు మరి.

ఒకవేళ ఆ సినిమాలో చేయడం ఇష్టం లేకనే ఇలా పబ్లిక్ గా చెప్పేసి.. అనవసరంగా టంగ్ స్లిప్పయ్యిందేమో? తొందరపడి ముందే కూస్తే.. తెల్లారినట్లు కాదుగా.. ఏదేమైనా అమ్మడు మాత్రం తెలుగులో సాయిధరమ్ సినిమా మాత్రమే చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. అదొక్కటే చేస్తోందంట.. మిగిలినవారు కాస్త ఛాన్సులు ఇవ్వండి గురూ!!

,  ,  ,  ,  ,