Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2017 11:36:43
facebook Twitter Googleplus
Photo

కొత్తగా మ్యారేజ్ అయిన జంట హ్యాపీగా హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లడం చూస్తూనే ఉంటాం. కానీ సమంత.. నాగ చైతన్యని వివాహం చేసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్లలేదు. పెళ్లి అవ్వగానే డైరెక్ట్ గా హైదరాబాద్ లో అక్కినేని వారి ఇంట కోడలిగా అడుగుపెట్టింది. అయితే ఆ తర్వాత వెంటనే రాజుగారి గది 2 సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ తో కలిశారు.

అయితే ఆమె షూటింగ్ లలో పాల్గొనాల్సిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం సమంత రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సావిత్రి బయోపిక్ లో కూడా స్పెషల్ రోల్ లో కనిపించనుంది. ఇక కోలీవుడ్ లో కూడా ఓ రెండు సినిమాల షూటింగుల్లో ఆమె పాల్గొనాలి. అయితే మొదట అందరు రంగస్థలం సినిమా షూటింగ్ కి సమంత వెళుతుంది అనుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ చాలా ఉంది. అనుకున్న టైమ్ కి షెడ్యూల్ ఏ మాత్రం అయిపోలేదట. కానీ సమంత మాత్రం సావిత్రి బయోపిక్ మహానటి షూటింగ్ కోసం అక్టోబర్ 14న వెళ్లనుంది. అక్కడ షెడ్యూల్ ప్రకారం కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉండడంతో త్వరగా పూర్తి చేసి వెంటనే రామ్ చరణ్ సినిమా షూట్ లో పాల్గొనాలని సమంత ప్లాన్ వేసుకుందట.

అలాగే తమిళ సినిమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి భర్తతో కొన్ని రోజుల పాటు హ్యాపీగా గడపాలని సమంత అనుకుంటోందట.

,  ,  ,  ,  ,