Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Sep-2017 12:15:25
facebook Twitter Googleplus
Photo

స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో వెండితెరకు పరిచయమైన భామ మెహ్రీన్ పిర్జాద. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ భామ అందానికి అందరు ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో మహాలక్ష్మి పాత్రలో మెరిసి నాని కి హిట్ ఇచ్చిన విధంగానే తమకు కూడా ఈ మహాలక్ష్మి హిట్ ఇస్తుందని నమ్మకంతో ఓ ముగ్గురు హీరోలు ఈమెను ఎంచుకున్నారు.

గత ఏడాది నుంచి అమ్మడు గ్యాప్ లేకుండా బిజీ బిజీ షెడ్యూల్ తో తీరిక లేకుండా కష్టపడుతోంది. రవితేజ - రాజా ది గ్రేట్ అండ్ సాయి ధరమ్ తేజ్ - జవాన్ సినిమాలతో పాటు శర్వానంద్ - మహానుభావుడు సినిమాల్లో ఒకేసారి నటించింది. అయితే అమ్మడి పై గతంలో కొన్ని కామెంట్స్ గట్టిగా వినిపించాయి. మెహ్రీన్ నటనపరంగా ఆమె సెట్స్ లో డైరెక్టర్ కి హీరోకి చిరాకు తెప్పించిందని ముఖ్యంగా రాజా ది గ్రేట్ సినిమా షూటింగ్ లో దర్శకుడు అనిల్ రావిపూడి హీరో రవితేజా చాలా డిస్సపాయింట్ అయ్యారని కథనాలు వెలువడ్డాయి. అలాగే జవాన్ సినిమాలో సెట్ లో నుండి సడన్ గా ఎందుకో కోపంతో వెళ్లిపోయిందని కూడా సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి.

అయితే ఈ కామెంట్స్ అన్నిటికీ మెహ్రీన్ తనదైన శైలిలో సమాధానాన్ని ఇచ్చింది. ఏ మాత్రం ఆ న్యూస్ గురించి ప్రస్తావించకుండా తనకు సపోర్ట్ గా నిలుస్తున్న వారందరికీ చాలా కృతజ్ఞతలు అని తెలిపింది. ఏడాది నుంచి తీరిక లేకుండా షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నాను అని సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని అందించింది. అంతే కాకుండా ఆ సినిమాలు అన్ని తప్పకుండా మీకు నచ్చుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది ఈ నయా బిజీ స్టార్.

,  ,  ,  ,  ,