Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2016 11:44:05
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ లో.. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఓరియెంటెడ్ కాప్ డ్రామా ఈ మూవీ తెరకెక్కుతోందనే టాక్ ఉండగా.. ఇప్పటికే హైద్రాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది.

చెన్నైలోని ఈవీపీ వరల్డ్ లో మహేష్ బాబు సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇక్కడ భారీ సెట్స్ వేసి మరీ షూట్ చేస్తున్నారట. ఇప్పటికి ఇరవై రోజులుగా పిక్చరైజేషన్ చేస్తుండగా.. ఈ నెల 22 అంటే రేపటితో చెన్నై షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ మొత్తం ఈవీపీ వరల్డ్ వేసిన భారీ సెట్టింగ్స్ లోనే పిక్చరైజ్ చేయడం విశేషం. మొత్తం సినిమాకి ఈ సెట్టింగ్స్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. బడ్జెట్ గురించి ఏ మాత్రం సందేహించకుండా.. అత్యంత భారీ ఖర్చుతో వేసిన ఈ సెటింగ్స్.. అందరినీ ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు.

మరుసటి షెడ్యూల్ ని హైద్రాబాద్ లో ప్లాన్ చేయగా.. ఇక్కడ జనతా గ్యారేజ్ కోసం గ్యారేజ్ సెట్.. జ్యో అచ్యుతానంద కోసం వేసిన హౌస్ సెట్ లో.. మహేష్ అండ్ టీమ్ షూటింగ్ చేసేందుకు ఇప్పటికే డిసైడ్ అయ్యారనే వార్తలు ఉన్నాయి. మొత్తం మీద మహేష్-మురుగలు సెట్టింగ్స్ చుట్టూనే సినిమాని ఫినిష్ చేసేస్తుండడం విశేషం.

,  ,  ,  ,  ,  ,