Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2017 10:31:07
facebook Twitter Googleplus
Photo

సినిమా చరిత్రలోనే పెళ్లి చూపులు ఓ సెన్సేషన్ అయిపోయింది. చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించడమే కాదు.. నేషనల్ అవార్డుని.. రీసెంట్ గా నంది అవార్డును కూడా ఎగరేసుకుపోయింది. అంతేకాదు.. ఎంతోమంది ఫిలిం మేకర్స్ కు స్ఫూర్తిగా కూడా నిలిచింది.

ఇప్పుడు పెళ్లి చూపులు నిర్మాతలు తమ కొత్త వెంచర్ మెంటల్ మదిలో మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నారు. ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్న మెంటల్ మదిలో చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. పెళ్లి చూపులు మాదిరిగానే ముందుగానే సెలబ్రిటీలతో పాటు పలువురికి ప్రివ్యూ షోస్ వేసి ప్రచారం చేస్తుండడం విశేషం. అయితే.. మెంటల్ మదిలో మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ద్వితీయార్ధంలో కాస్త స్లోగా ఉన్నా.. ఓవరాల్ గా సినిమా సూపర్బ్ అనేస్తున్నారు. దీంతో మెంటల్ మదిలో మూవీపై అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి.

శ్రీ విష్ణు హీరోగా.. నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటించిన మెంటల్ మదిలో చిత్రం.. నిర్మాత రాజ్ కందుకూరికి.. మళ్లీ పెళ్లిచూపులు రేంజ్ సక్సెస్ అందిస్తుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. దర్శకుడు ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరును కూడా ప్రశంసిస్తుండడం విశేషం. ఇంకా మెంటల్ మదిలో చిత్రం రిలీజ్ కాకుండానే.. ఓ స్టార్ హీరోతో సినిమాకు ఈ దర్శకుడు రెడీ అయిపోతున్నాడనే టాక్ ఆశ్చర్యం కలిగిస్తోంది.

,  ,  ,  ,  ,