Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2016 13:39:59
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తోన్న కబాలి సినిమాపై తెలుగు, తమిళ భాషల్లో ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కబాలి ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తమిళంలో రియలిస్టిక్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా. రంజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఈ రోజు మొదలయ్యాయని తెలిసింది.
ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో విపరీతమైన అంచనాలు రేకెత్తించిన కబాలి సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా మరో రెండు వారాల్లో టీజర్ రిలీజ్‌ చేయనున్నట్లు తెలిసింది. ఆ తరువాత జోరుగా ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే నటిస్తున్న ఈ సినిమా తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు తరువాత విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించినట్టు సమాచారం.

,  ,  ,  ,  ,  ,  ,