Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Jul-2015 15:18:13
facebook Twitter Googleplus
Photo

మోహన్బాబు సినిమాకి బోలెడన్ని హంగులు జోడిస్తున్నారు. 23 యేళ్ల తర్వాత మా కాంబినేషన్ అంటూ ఇప్పటికే రమ్యకృష్ణ మీనాల్ని ఎంపిక చేసి సినిమాకి క్రేజీనెస్ని తీసుకొచ్చారు మోహన్బాబు. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లనీ సెట్ చేశారు.యువజంట అల్లరి నరేష్ పూర్ణ కూడా ఆడిపాడబోతోంది. `మామ మంచు అల్లుడు కంచు` పేరుతో రూపొందనున్న ఈ సినిమాకి ఇంకో అదనపు ఆకర్షణని కూడా జోడిస్తున్నట్టు సమాచారం. అందేంటంటే... మోహన్బాబు నటించిన అల్లరి మొగుడులోని `ముద్దిమ్మందీ... ఓ చామంతీ` పాటని రీమిక్స్ చేయబోతున్నారట. ఆ రీమిక్స్ కోసమే కుంచె రఘుని రంగంలోకి తీసుకొచ్చినట్టు సమాచారం.

ముద్దిమ్మందీ... చాలా పాపులర్ పాట. ఆ పాటని మళ్లీ రీమిక్స్ చేసి వినిపిస్తే అదిరిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించనున్న చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లబోతోంది. ఓ మరాఠీ చిత్రం ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాని మోహన్బాబు `అల్లరి మొగుడు` చిత్రానికి లింకు పెడుతూ తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై విష్ణు నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్తో రూపొందనున్న ఈచిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చేస్తారని తెలిసింది.

,  ,  ,