Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Sep-2016 11:52:00
facebook Twitter Googleplus
Photo

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ట్యాలెంట్ ఎలాంటిదో టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియచేసిన సినిమా జనతా గ్యారేజ్. యంగ్ టైగర్ లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్ సినిమాలో ఉంటే.. ఓ లీడ్ కేరక్టర్ కోసం కొరటాల శివ మోహన్ లాల్ ని ఎందుకు తెచ్చుకున్నాడా అనే ప్రశ్నకు సమాధానం.. సినిమా చూసిన ప్రేక్షకులకు ఈజీగానే దొరికేసింది. మరి ఇలాంటి మహానటుడు.. ఓ మహనీయుడి గెటప్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది?

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఓషో గెటప్ లో కనిపించి.. అందరికీ షాక్ ఇచ్చాడు మోహన్ లాల్. ఓషో జీవితంపై బయోపిక్ తీయాలని అనుకుంటున్నారో.. లేక ఇప్పటికే మొదలుపెట్టేశారో చెప్పలేం కానీ.. అచ్చు గుద్దినట్లు ఓషో గెటప్ లో కనిపించి.. అందరినీ విస్మయానికి గురి చేశారాయని. 'హద్దులు లేని వ్యక్తి గురించి గుర్తులు.. సముద్రమంత ప్రేమ' అనే ఓ కేప్షన్ పెట్టి.. ఓషో గెటప్ లో మోహన్ లాల్ కనిపించడం చర్చనీయాంశమైంది.

అలాగని కొత్త సినిమా అందామని అనుకుంటే.. నోటిలో సిగరెట్ పెట్టుకుని మరీ న్యూ మూవీ గెటప్ అంటూ మోహన్ లాల్ ఫేస్ బుక్ పేజ్ సాక్షిగా చెప్పేశారు. మరి ఓషో గెటప్ ఎందుకు వేయాల్సొచ్చిందో మాత్రం ఇంకా పజిల్ గానే మిగిలిపోయింది.

,  ,  ,  ,  ,