Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2017 12:12:58
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ.. మార్చ14న షూటింగ్ ప్రారంభించుకోనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాటమరాయుడును పూర్తి చేసే పనిలో ఉన్న పవన్.. మరో నెలరోజుల్లో త్రివిక్రమ్ మూవీని ప్రారంభించేస్తాడు. ఈ చిత్రంపై చాలానే అంచనాలు ఉండగా.. వాటిని రోజురోజుకూ పెంచేస్తున్నాడు మాటల మాంత్రికుడు.

ఇప్పుడీ సినిమాలో ఓ స్పెషల్ కేరక్టర్ కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోనున్నారనే న్యూస్ సంచలనం అయిపోతోంది. మోహన్ లాల్ ఈ మధ్య తెలుగులో కూడా మంచి ఇమేజ్ సంపాదించేసుకున్నాడు. దీనికి తోడు త్రివిక్రమ్ మూవీలో స్పెషల్ కేరక్టర్ అంటే.. కచ్చితంగా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. అందుకే ఈ పాత్రకు మోహన్ లాల్ ను అనుకోవడం.. దానికి మలయాళ సూపర్ స్టార్ సై అనడం కూడా జరిగిందట. అయితే.. ఇంకా సైన్ చేయకపోయినా.. ఈ పాత్రను మోహన్ లాల్ చేయడం ఖాయం అంటున్నారు.

ఇప్పటికే హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న పవన్-త్రివిక్రమ్ మూవీ.. మోహన్ లాల్ ఎంట్రీతో మరింత భారీగా మారిపోతోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్.. అను ఇమాన్యుయేల్ లు హీరోయిన్స్ కాగా.. కోలీవుడ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే 3 పాటలకు ట్యూన్స్ రెడీ చేసేశానని రీసెంట్ గా చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,