Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Aug-2017 13:45:55
facebook Twitter Googleplus
Photo

అజిత్ నటించిన వివేగం(తెలుగులో వివేకం) మూవీ గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. టాక్.. రివ్యూలు అన్నీ నెగిటివ్ గా ఉన్నా సరే.. ఓపెనింగ్ కలెక్షన్స్ లో మాత్రం ఆల్ టైం రికార్డులు నమోదు చేసేస్తోంది. అతి వేగంగా 100 కోట్ల మార్క్ ను వసూలు చేసిన తమిళ్ మూవీ రికార్డ్ కూడా వివేగం ఖాతాలో పడిపోతుందని అంటున్నారు.

వివేగం అభిమానులను ఇంతగా మెస్మరైజ్ చేయడానికి కారణం.. అందులో ఉన్న యాక్షన్ కంటెంట్. రెండున్నర గంటల సినిమాలో.. గంటన్నరకు పైగా యాక్షన్ ఎపిసోడ్స్ పిక్చరైజ్ చేశారంటే.. అది కూడా హాలీవుడ్ రేంజ్ లో సన్నివేశాలు తీర్చిదిద్దారంటేనే.. హీరో-డైరెక్టర్ ఈ సినిమా కోసం ఏ స్థాయిలో కష్టపడ్డారో అర్ధమవుతుంది. నిజానికి కొన్నేళ్లుగా.. అంటే బిల్లా టైం నుంచి అజిత్ యాక్షన్ మూవీస్ కే ప్రాధాన్యత ఇస్తున్నాడు. పైగా దర్శకుడు శివ(శౌర్యం.. దరువు ఫేం)తో సినిమాలు చేయడం మొదలెట్టాక వీటి డోస్ మరింతగా పెరిగింది. అజిత్ నటించిన గత నాలుగు సినిమాల్లో మూడు శివ డైరెక్ట్ చేసినవే(వీరం.. వేదాళం.. వివేగం). అయితే.. ఇదే ఊపులో అజిత్-శివ తమ కాంబినేషన్ లో నాలుగో సినిమాకు కూడా రెడీ అవుతున్నారట.

అయితే.. ఈ సారి మాత్రం యాక్షన్ ఫిలిం కాకుండా.. ఫ్యామిలీ ఎంటర్టెయినర్ కానీ.. హిస్టారికల్ మూవీ కానీ చేయాలని భావిస్తున్నారట అజిత్ అండ్ శివ. చారిత్రాత్మక చిత్రం చేసేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ టాక్.

,  ,  ,  ,  ,