Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Sep-2015 15:21:19
facebook Twitter Googleplus
Photo

ఫ్యాషన్ సినిమా చూసిన వారెవరైనా బ్లాక్ బ్యూటీ ముగ్ధా గాడ్సేని అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఈ భామ సౌత్ కి సుపరిచితం కాకపోయినా ఆ సినిమాతో తెలుగు వారికి కూడా సుపరిచితమై మనసు దోచింది. ఆరున్నర అడుగుల ఎత్తు ఉండే ఈ అమ్మడు నల్లకలువకు మారు రూపంలా కనిపిస్తుంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చింది కాబట్టి ఈ అమ్మడి ర్యాంప్ వాక్ చూస్తే మతి చెడాల్సిందే. ఫ్యాషన్ లో కంగన ప్రియాంక చోప్రా లాంటి బ్యూటీస్ ఉన్నా ఈ అమ్మడి గురించిన ఆరాలు కూడా యువతరం తీశారంటే అర్థం చేసుకోవచ్చు. అంతటి క్రేజు వచ్చింది కాబట్టే ఇన్నేళ్ల కెరీర్ లో తిరిగి చూసుకోవాల్సిన పనే లేకుండా పోయిందని ముగ్ధ చెబుతోంది. ఇప్పుడు ఈ హాట్ మోడల్ సౌత్ లో కూడా అడుగు పెట్టింది. వస్తూనే తమిళ తంబీల మనసు కొల్లగొట్టింది.

ఈ ముగ్ధ మనోహరి తాజా హిట్ తని ఒరువన్ తమిళనాట విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇందులో ఓ ఐటెమ్ నంబర్ ఓ చిన్న రోల్ లో నర్తించి తంబీల మనసు కొల్లగొట్టింది. తని ఒరువన్ తో జయం రవికి ఎంత పేరొచ్చిందో .. ఈ అమ్మడికి కూడా అంతే పేరొచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ట్రైలర్స్ లో ముగ్ధని ఏమాత్రం హైలైట్ చేయనేలేదు. సడెన్ సర్ ప్రైజ్ చేశారు. దాంతో థియేటర్లలోకి వెళ్లిన ఆడియెన్ కి ముగ్ధ అందాలు కనువిందు చేశాయనే అంటున్నారు. తంబీలకు నచ్చిందంటే తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు నచ్చేయడం ఖాయం. కాబట్టి ఈ భామకు తెలుగులో ఛాన్సులివ్వాలే కానీ ఐటెమ్ భామ రేసులో నెగ్గుకుకొచ్చేస్తుంది. తని ఒరువన్తో వచ్చిన గుర్తింపును ఇక్కడ క్యాష్ చేసుకునే హుషారులో ఉంది కాబట్టి ఇదే టైమ్. ముగ్ధ తెలుగు ఇండస్ర్టీలో పాగా వేస్తుందా మరి? వెయిట్ అండ్ సీ.

,  ,  ,  ,