Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2017 11:45:41
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగచైతన్య.. సౌత్ బ్యూటీ సమంత.. త్వరలో పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలంలో ప్రేమించుకుంటున్న వీరిద్దరూ అక్టోబర్ 6న ఒకటి కాబోతోన్నారు. ఈ విషయాన్ని అధికారికంగానే చెప్పాడు చైతు.

మా పెళ్లి తేదీ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం రాలేదు. అక్టోబర్ 6న మా ఇద్దరి పెళ్లి అనే విషయం.. ఓ అవార్డ్ ఫంక్షన్ లో చెప్పేయడంతో.. ఎక్కడా అనౌన్స్ మెంట్ కి ఛాన్స్ లేదు అంటున్నాడు చైతు. అయితే.. గత కొన్ని రోజులుగా చైతు-సమంతలు తమ పెళ్లి ఖర్చు తామే పెట్టుకుంటామని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన చైతు.. 'మేం అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటా.. పెళ్లి అంటే మా రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా గడిపే సందర్భం. ఒకవేళ నేను అలాంటి సలహా ఇస్తే నాన్న ఎంతో బాధపడతారు. రెండు కుటుంబాలు కలిసి నిర్వహించనున్నాయంతే' అన్నాడు చైతు. అయితే.. పెళ్లి వేదిక విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతున్నారట.

ఇక్కడైతే అందరినీ ఆహ్వానించే ఛాన్స్ ఉంటుంది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే.. కొందరినే ఎంపిక చేసి పిలవాల్సి ఉంటుంది. కానీ మా ఇద్దరి మెంటాలిటీ ప్రకారం గోవాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలని భావిస్తున్నాం. అలాగని రెండు కుటుంబాలకు చెందిన మెంబర్స్ సెంటిమెంట్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం.

,  ,  ,  ,