Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2015 13:39:06
facebook Twitter Googleplus
Photo

'ముకుంద' సినిమాలో కూల్ గా కనిపిస్తూనే హీరోయిజాన్ని చూపించిన వరుణ్ తేజ్, తన రెండో చిత్రం 'కంచె'తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన నటిస్తోన్న 'కంచె' చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రోజుతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతున్నట్టుగా వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాను దసరా పండుగ సందర్భంలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో కాస్త గ్యాప్ తీసుకుని 'క్రిష్' ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

రాజీవ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ జంటగా 'ప్రగ్యా జైస్వాల్' నటిస్తోంది. మొదటి సినిమాతోనే వరుణ్ ఆకట్టుకున్నందు వలన, ఆయన రెండొవ సినిమా కోసం యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఇప్పటివరకూ భిన్నమైన కథాంశాలను తెరకెక్కిస్తూ వచ్చిన క్రిష్, ఈ సినిమాకి దర్శకుడు కావడం కూడా అంచనాలను పెంచుతోంది. టైటిల్ ను బట్టి వరుణ్ ని ఈ సినిమాలో ఆయన కాస్త రఫ్ గా చూపించవచ్చని అనుకుంటున్నారు. మరి ఈ రఫ్ కేరెక్టర్ లో వరుణ్ ఎన్ని మార్కులు సంపాదించుకుంటాడనేది దసరా పండుగకి తెలిసిపోతుంది.

,  ,  ,