Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2017 13:09:29
facebook Twitter Googleplus
Photo

మల్టి స్టారర్ సినిమాలకు ప్రాణం పోస్తున్న హీరో వెంకటేష్ అనే చెప్పాలి. చాలా వరకు హీరోలు స్టార్ హోదాకు బయపడి సినిమాలను చెయ్యడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. కానీ వెంకటేష్ మాత్రం తన స్టార్ హోదాని సైతం పక్కన పెట్టేసి చిన్న పెద్దా తేడా లేకుండా అందరి హీరోలతోను స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

త్వరలో మారో మల్టి స్టారర్ సినిమాను చెయ్యడానికి రెడీ అయ్యారట వెంకీ. అది కూడా తన మేనల్లుడు నాగ చైతన్యతోనే అని తెలుస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన - రారొండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో తండ్రి కొడుకులకు హిట్స్ ఇచ్చిన కళ్యాణ్ కురసాల ఈసారి మామ అల్లుళ్ల కాంబో లో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

చైతు కూడా ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ హీరో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సవ్యసాచి సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకటేష్ తేజా దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ లో ఉంటుంది.

,  ,  ,  ,  ,