Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 15:32:02
facebook Twitter Googleplus
Photo

మామూలుగా హీరోలు మీడియాను కలిసినపుడు తాను చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతాడు. ఐతే అక్కినేని నాగచైతన్య మాత్రం తాను ఫలానా సినిమా చేయట్లేదు అని చెప్పుకోవాల్సి వస్తోంది. ప్రేమమ్ సూపర్ హిట్టయ్యాక చైతూ చేయబోతున్నాడంటూ చాలా సినిమాలు తెరమీదికి వచ్చాయి. ఐదారు సినిమాలతో అతడి పేరు ముడిపెట్టారు. ఐతే వాటిలో ఒక్కొక్కటిగా క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి. ఈ సినిమా చేయట్లేదు.. ఆ సినిమా చేయట్లేదు అంటూ ఒక్కొక్కటిగా క్లారిటీ ఇస్తూ వస్తున్నాడు చైతూ.

ముందు తమిళ హిట్ మూవీ మెట్రో రీమేక్ లో చైతూ నటిస్తాడన్నారు. కానీ అదేమీ లేదని తేలిపోయింది. ఇప్పుడా సినిమాను నేరుగా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో కృష్ణ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా అన్నారు. దాన్ని కూడా ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టేశారు. తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చైతూ చేయాల్సిన సినిమా కూడా ఆగిందంటున్నారు. దీని బదులు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నాడు చైతూ. తాజాగా 2 స్టేట్స్ రీమేక్ విషయంలోనూ చైతూ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమాలో చైతూ-సమంత జంటగా నటిస్తారని ప్రచారం జరిగింది. దీనిపై చైతూ స్పందిస్తూ.. మేం ఆ సినిమా చేయట్లేదు. మేమసలు ఆ స్క్రిప్టు కూడా వినలేదు. ఇక ఆ సినిమా చేసే అవకాశం ఎక్కడ అని చైతూ క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశాడు. మరి 2 స్టేట్స్ రీమేక్ లో ఎవరు నటిస్తున్నట్లు?

,  ,  ,  ,  ,  ,