Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2016 11:41:26
facebook Twitter Googleplus
Photo

సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు పద్మవిభూషణ్ రజినీకాంత్ అయిపోయారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు రజినీ. ఇదే సందర్భంలో మరింతమందికి కూడా పద్మ అవార్డులను అందుకున్నారు. ఇలా పద్మ పురస్కారాలు అందుకున్నవారిలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా - స్పోర్ట్స్ పర్సన్ సానియా మీర్జా కూడా ఉన్నారు.

సానియాకు పద్మ భూషణ్ అవార్డు దక్కగా... ప్రియాంక చోప్రా పద్మశ్రీ అందుకుంది. ఇలా వీరిద్దరూ తమ అవార్డులు తీసుకున్న తరువాత.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి ఫోటో దిగారు. ఆయనపై తమ అభిమానాన్ని చెప్పి.. ఫోటో దిగాలనే కోరికను చెప్పుకొచ్చారు ఈ ఇధ్దరు పద్మాలు. వాళ్లే పెద్ద సెలబ్రటీలు - అందులోనూ అమ్మాయిలు.. మరి వాళ్లు అడిగితే ఫోటో దిగకుండా ఉంటారా మన సూపర్ స్టార్ రజినీకాంత్.

అడింగిందే తడవుగా... కాసింత మొహమాటంతో ఫోటోకి పోజిచ్చేశారు. ఒకవైపు పద్మ శ్రీ ప్రియాంక చోప్రా మరోవైపు పద్మభూషణ్ సానియా మీర్జా.. మధ్యలో పద్మ విభూషణ్ రజినీకాంత్... భలే చూడముచ్చటగా ఉంది ఈ ఫోటో. ఏమైనా సెలబ్రిటీలకే సెలబ్రిటీ కం లెజెండ్ సూపర్ స్టార్ రజినీకాంత్. అందుకే ఆయనతో ఫోటో కోసం అంతటి సుందరాంగులు కూడా వెంపర్లాడతారు.

,  ,  ,  ,  ,  ,  ,  ,