Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2017 13:18:32
facebook Twitter Googleplus
Photo

ప్రేమమ్ మూవీతో బ్లాక్ బస్టర్ కు దగ్గరగా వచ్చిన చైతు.. ప్రస్తుతం రా రండోయ్ వేడుక చూద్దాం మూవీని విడుదలకు సిద్ధం చేశాడు. మరో రెండు రోజుల్లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుండగా.. సమ్మర్ లోనే ఈ సినిమా తెరపైకి వచ్చేయనుంది. మరోవైపు.. అక్కినేని నాగచైతన్య తమిళ అరంగేట్రంపై ఇప్పటికే ప్రకటన వచ్చేసిది.

నగరసూరన్ అనే తమిళ్ మూవీతో చైతు కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పారు. ఈ చిత్ర నిర్మాతల్లో గౌతమ్ మీనన్ కూడా ఒకడు కావడం.. చైతు-గౌతమ్ ల మధ్య అనుబంధం చాలా స్ట్రాంగ్ కావడంతో.. ఇక అంతా సాఫీగా నడిచిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడీ నగరసూరన్ ప్రాజెక్ట్ నుంచి చైతు తప్పుకున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావడం కాసింత ఆలస్యం కావడంతో.. తెలుగులో తను కేటాయించిన పలు చిత్రాలకు సంబంధించి డేట్స్ సమస్య వచ్చిందట. అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యాడు చైతు.

నాలుగు కేరక్టర్ల మధ్య నడిచే ఈ కథలో ప్రతీ పాత్రకు సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్రియ శరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

,  ,  ,  ,  ,