Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2017 10:47:43
facebook Twitter Googleplus
Photo

సౌతిండియాలో జెండా స్ట్రాంగ్ గా పాతేసిన భామ శ్రియా శరణ్. ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు దాటిపోయినా ఇంకా ఈమె అందానికి అభిమానులు దాసోహం అంటూనే ఉన్నారు. ఆకట్టుకునే అందానికి.. మెప్పించే ప్రతిభ తోడవడంతో శ్రియ ఇప్పటికీ హాట్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే ఉంది.

శ్రియా శరణ్ కనిపించని సినిమా అవార్డు ఫంక్షన్ లు అరుదుగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. పలు భారతీయ నృత్యాల్లో మేటి అయిన ఈ నాట్యగత్తెతో ప్రదర్శన ఇప్పించడం ఇప్పటికీ అవార్డు వేడుకల నిర్వాహకులకు ఆనవాయితీ. రీసెంట్ గా సైమా అవార్డ్ ఫంక్షన్ జరిగితే.. అక్కడ కూడా మెరిసిపోయింది ఈ సుందరాంగి. స్టైలింగ్ విషయంలో కొత్తదనం చూపించిన శ్రియ.. తన అందంతో అందరి మతులు పోగొట్టేసింది. స్లీవ్ లెస్ డ్రెస్.. ట్రాన్స్ పరెంట్ వేర్.. అందాలను దాచిపెడుతున్న ఫ్లవర్.. అందంగా ప్రదర్శనకు ఉంచిన క్లీవేజ్.. వస్త్రధారణతోనే సగం ఆకట్టుకున్న శ్రియ.. తన సొగసులతో మిగిలిన సగం మందిని పడేసింది.

కాస్ట్యూమ్స్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటూ.. ఈ తరం భామలకు గట్టి పోటీ ఇవ్వడం శ్రియకు మాత్రమే సాధ్యమైన విద్య అని చెప్పచ్చు. బాలకృష్ణ 100వచిత్రంలో మెప్పించిన శ్రియ.. ఇప్పుడు 101వ మూవీ పైసా వసూల్ లో కూడా కనిపించనుంది.

,  ,  ,  ,