Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2017 11:10:15
facebook Twitter Googleplus
Photo

ఎప్పటినుండో తుపాకి.కామ్ చెబుతూనే ఉన్నా కూడా.. అఫీషియల్ గా ఆ వరుడి నోట ఆ డేట్ వింటే ఆ కిక్కే వేరబ్బా. అందుకే ఇప్పుడు దాచడం పెద్దగా ఇష్టం లేని నాగ చైతన్య.. చక్కగా డేట్ చెప్పేశాడు. తన ప్రేమకథకి పెద్ద టర్నింగ్ ఇచ్చి.. దానిని పెళ్ళి కథ వైపు నడిపించే ఆ డేట్ ఎప్పుడంటే.. పదండి చూద్దాం.

ఈరోజు ఫిలింఫేర్ అవార్డుల గురించి ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన నాగ చైతన్య.. చాలా ఆనందంగా కనిపించాడు. ముఖ్యంగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమా బాగా ఆడేయటం కారణంగా వచ్చిన హ్యాపినెస్ ఒకవైపు కనిపిస్తే.. త్వరలోనే తన పెళ్ళి జరగబోతుందన్న ఆనందం మరోవైపు కనిపించింది. ఆ మీటింగులో ఒక లేడీ జర్నలిస్టు.. మీ పెళ్ళి అక్టోబర్ లోనేనా అని అడిగితే.. అవును.. అక్టోబర్ 6న అని చెప్పేశాడు. ఆ విధంగా తన పెళ్ళి డేట్ అఫీషియల్ గా కన్ఫామ్ చేశాడు.

ఇకపోతే ఈ ఫిలింఫేర్ అవార్డుల్లో దాదాపు అన్ని క్యాటగిరీల్లో నామినేట్ అయ్యారు. నాగ చైతన్య అండ్ నాగార్జున ఇద్దరూ కూడా బెస్ట్ యాక్టర్స్ గా నామిషేన్ కొట్టేయడం ఒక విశేషం.

,  ,  ,  ,  ,