Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 13:56:31
facebook Twitter Googleplus
Photo

అప్పుడప్పుడు సినిమా హీరోలు పాటలు పాడటం మామూలే. కానీ ఇప్పుడు కథానాయికలు కూడా పాటలు పాడేస్తున్నారు. నిత్యామీనన్ తరువాత ఇప్పుడు చెన్నై సుందరి త్రిష ఇప్పుడు ఆ జాబితాలోకి చేరింది. దాదాపు దశాబ్దం కాలం పైగా తెలుగు, తమిళ్ సినిమా లో అగ్రతారగా వెలుగొందుతున్న త్రిష ప్రధాన పాత్రలో నటించిన ?నాయకి? సినిమాలో ఓ పాట పాడిన విషయం తెలిసిందే.
?నాయకి? కోసం త్రిష పాడిన పాటను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ యూ ట్యూబ్ ద్వారా విడుదల చేయగా ఆ పాట అందరినీ ఆకట్టుకుంటున్నది. భాస్కర భట్ల రాసిన ఈ పాటకు రఘుకుంచె సంగీతం సమకూర్చారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ?నాయకి? సినిమాకి ?లవ్ యూ బంగారం? ఫేం దర్శకుడు గోవి దర్శకత్వం వహించగా గిరిధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

,  ,  ,  ,