Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-May-2016 13:06:19
facebook Twitter Googleplus
Photo

తమ తండ్రులు నటించిన పలు బ్లాక్ బస్టర్లు - క్లాసిక్ లపై కుర్ర హీరోలకు ఎప్పటి నుంచో కన్ను ఉంది. గ్యాంగ్ లీడర్ ను రామ్ చరణ్ - అసెంబ్లీ రౌడీని మంచు విష్ణు రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. మిస్సమ్మ - గుండమ్మ కథలపై కూడా యంగ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పుడు అక్కినేని వారసుడు నాగచైతన్యతో.. 1990ల్లో వచ్చిన ఓ నాగార్జున సినిమాను.. రీమేక్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో నాగార్జున - టబు జంటగా వచ్చిన నిన్నే పెళ్లాడుతా. అప్పట్లో ఎన్నో సంచలనాలను - రికార్డులను సృష్టించిన మూవీ ఇది. ఇప్పుడు నిన్నే పెళ్లాడుతా చిత్రాన్ని చైతుతో మరోసారి తీసేందుకు రంగం సిద్ధమవుతోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రేమమ్ - సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలను చేస్తున్నాడు చైతు. ఇవి రెండు రొమాంటిక్ లవ్ స్టోరీలే.

వీటి తర్వాత నిన్నే పెళ్లాడుతా లాంటి లవ్ స్టోరీని చేయాలని భావించడం ఆశ్చర్యకరమే. అయితే.. తను రొమాంటిక్ సినిమాలు మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యాడట నాగ చైతన్య. తనకు కంఫర్ట్ గా ఉండడం ప్రేక్షకులు తన నుంచి ఆశిస్తున్నవి ఇలాంటి సినిమాలే కావడంతో.. ఇకపై ప్రేమ కథా చిత్రాలనే చేయనున్నాడట చైతు. అందులో నిన్నే పెళ్లాడుతా రీమేక్ కూడా ఒకటి.

,  ,  ,  ,  ,