Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Oct-2016 13:55:27
facebook Twitter Googleplus
Photo

మొత్తానికి నాగచైతన్య.. సమంతతో ప్రేమాయణం గురించి పూర్తిగా ఓపెన్ అయిపోయాడు. దాగుడు మూతలు లేకుండా అన్ని విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడేశాడు. తమ ఇద్దరి ప్రేమాయణం ఎలా మొదలైంది.. పెళ్లి వైపు ఎలా నిర్ణయం తీసుకున్నది ఆ ఇంటర్వ్యూలో వివరించాడు చైతూ. సమంత దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చింది తనేనని కూడా చైతూ వెల్లడించడం విశేషం

??ఏమాయ చేసావె సమయంలో ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. కష్టసుఖాలు మాట్లాడుకునేవాళ్లం. సినిమాలు హిట్ అయినప్పుడు.. ఫ్లాప్ అయినప్పుడు మా ఫీలింగ్స్ ఒకరితో ఒకరం పంచుకునేవాళ్లం. అలా మాకు తెలియకుండానే మంచి స్నేహితులం అయ్యాం. ఇక ప్రేమ అన్నది మాకు తెలియకుండానే జరిగిపోయింది. ఐతే మేమిద్దరి ఇప్పటిదాకా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదంటే ఎవరూ నమ్మరేమో.

ఇక పెళ్లి ప్రస్తావన విషయానికి వస్తే.. అది ఈ ఏడాదే జరిగింది. నేనే ఆ టాపిక్ తీసుకొచ్చాను. తన దగ్గరికెళ్లి.. ఎన్ని రోజులు ఇలా బాయ్ ఫ్రెండ్.. గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటాం. నాకు నువ్వు కరెక్ట్ అనిపిస్తోంది.. పెళ్లిచేసుకుందాం... మనిద్దరం ఒక రిలేషన్షిప్ లో కంటిన్యూ అవ్వాలంటే పెళ్లి చేసుకుందాం.. అలా కాకుండా ఇలాంటి బంధంలో ఎన్నిరోజులున్నా ప్రయోజనం ఉండదని చెప్పాను. పెళ్లి వద్దనుకుంటే ఇంతటితో ఆపేద్దాం అని కూడా అన్నాను. అప్పుడు తను కూడా ఓపెన్ అయింది. తన ఇష్టాన్ని తెలియజేసింది. పెళ్లి చేసుకోవాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాం?? అని చైతూ వివరించాడు.

,  ,  ,  ,  ,