Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Apr-2016 12:13:30
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా? అన్న ఎదురుచూపులకు మరో మూడు రోజుల్లో తెరపడిపోనుంది. ?సర్దార్ గబ్బర్ సింగ్? రూపంలో ప్రేక్షకులను అలరించేందుకు పవన్ ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్ల ముందుకు వచ్చేస్తున్నారు. ?అత్తారింటికి దారేదీ? తర్వాత పవన్ పూర్తి స్థాయి హీరోగా నటించిన సినిమా ఇదే కావడంతో సర్దార్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఓ సంచలనంగా మారిపోయింది. సినిమా రిలీజ్‍కు దగ్గరపడుతున్నా కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతూ వస్తోంది.
ఇక ఈ సినిమాలో పవన్ మార్క్ కామెడీ, యాక్షన్, డైలాగ్స్‌తో పాటు డ్యాన్స్ పరంగానూ పవన్ ఇరగదీశారని తెలుస్తోంది. ఇప్పటివరకూ పవన్ ఏ సినిమాలోనూ చేయని డ్యాన్స్ ఈ సినిమాలో చేశారని సమాచారం. ముఖ్యంగా తౌబ తౌబ, టైటిల్ సాంగ్స్‌లో పవన్ డ్యాన్స్ అభిమానులకు పండగే అని యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శరత్ మరార్ నిర్మించగా, కాజల్ హీరోయిన్‌గా నటించారు.

,  ,  ,  ,  ,