Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-May-2017 12:26:54
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. మొదట్లో ఒక సినిమా తర్వాత మరొకటి చేసుకుంటూ వచ్చిన ఈ హీరో.. గతేడాది నుంచి రూటు మార్చేశాడు. 2016లో కళ్యాణ వైభోగమే.. ఒక మనసు.. జ్యో అచ్యుతానంద.. నీ జతలేక.. అంటూ నాలుగు సినిమాలు విడుదల చేసేశాడంటే.. నాగ శౌర్య స్పీడ్ అర్ధమవుతుంది.

ఇప్పుడు కూడా అదే జోరు కంటిన్యూ చేస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్ర షూటింగ్ కోసం కొంతకాలంగా గుంటురులోనే మకాం వేసిన నాగ శౌర్య.. రీసెంట్ గానే హైద్రాబాద్ వచ్చాడు. ఈ సినిమాను స్వయంగా తనే నిర్మిస్తుండడం విశేషం. మరోవైపు అమ్మమ్మ గారి ఇల్లు అంటూ క్యాచీ టైటిల్ తో రూపొందుతున్న చిత్రంలో కూడా నాగ శౌర్య నటించేస్తున్నాడు. సుందర్ అనే దర్శకుడు దీన్ని తెరకెక్కిస్తున్నాడు. 'ఈ రెండు కథలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. రెండూ విపరీతంగా నచ్చేశాయి. అందుకే ఒకేసారి రెండింటినీ పూర్తి చేసేస్తున్నాను' అని చెప్పాడు నాగ శౌర్య.

పిల్ల జమీందార్.. సుప్రీమ్.. గీతాంజలి వంటి చిత్రాలకి సినిమాటోగ్రఫీ అందించిన సాయి శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు నాగ శౌర్య. ఈ మూడు సినిమాల దర్శకులకు.. డైరెక్టర్లుగా ఇవి తొలిచిత్రాలు కావడం విశేషం. ఈ మూడింటితో పాటు ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయిపోతున్న మూవీ మరొకటి ఉంది.

,  ,  ,  ,  ,