Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Sep-2016 14:11:44
facebook Twitter Googleplus
Photo

మొత్తానికి కింగ్ నాగార్జున క్లారిటీ ఇచ్చేశాక.. ఇక అఖిల్ రెండో సినిమా గురించి పెద్దగా డిస్కషన్లు అనేవే లేకుండా పోయాయ్. దర్శకుడు విక్రమ్.కె.కుమార్ తో తన చిన్నకొడుకు రెండో సినిమాను చేస్తున్నాడని ఆదివారం మరోసారి కన్ఫామ్ చేశారు కింగ్. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా షేర్ చేసుకున్నారు.

నిజానికి 'మనం' సినిమా చేస్తున్నప్పుడే.. విక్రమ్ ఈ రొమాంటిక్ లవ్ స్టోరి నాగార్జునకు నెరేట్ చేశాడట. పైగా ఈ కథ అఖిల్ కు ఎంతో బాగుంటుందని కూడా అనిపించిందంట. అయితే అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అఖిల్ ఈ సినిమాతో తెరంగేట్రం చేయాలని నాగ్ కూడా చాలా ఎక్సయిటెడ్ గా ప్లాన్ చేశారట. కాని ఏం జరిగిందో తెలియదు కాని.. కొన్ని లాజిస్టిక్ రీజన్స్ కారణంగా.. వివి వినాయక్ డైరక్షన్లో నితిన్ ప్రొడక్షన్లో అఖిల్ వేరే సినిమాను చేశాడు. అదే విక్రమ్ తీయబోయే రొమాంటిక్ సినిమాయే అఖిల్ డెబ్యూ అయ్యుంటే బాగుండేదని నాగ్ అనడం విశేషం.

ఇప్పటికే మనం సినిమాలో ఒక చిన్న రోల్ లో చివ్వర్లో చూపించి.. అఖిల్ ను ఇంట్రొడ్యూస్ చేసిన ఘనతను కొట్టేశాడు విక్రమ్. సర్లేండి.. మొదటి సినిమాతో అందని ద్రాక్షగా మిగిలిపోయిన ఆ హిట్టును ఇప్పుడు ఈ దర్శకుడు అందిస్తాడేమో చూద్దాం.

,  ,  ,  ,  ,  ,  ,