Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2016 10:22:09
facebook Twitter Googleplus
Photo

ప్రతీ వారం కొత్త సినిమాలు వచ్చేసినా.. కొత్తగా వచ్చేవి ఆకట్టుకోకలేకపోతే.. అప్పటికే థియేటర్లలో ఉన్న సినిమాలకు బాగా కలిసొస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కనిపిస్తోంది.

1. జనతా గ్యారేజ్: మూడో వీకెండ్ లో జనతా గ్యారేజ్ కలెక్షన్స్ ఇరగదీసేసింది. వీక్ డేస్ లో వసూళ్లు తక్కువగా ఉన్నా.. వీకెండ్స్ వచ్చేసరికి ఆ లోటు తీర్చేస్తోంది ఎన్టీఆర్ గ్యారేజ్.

2. జ్యో అచ్యుతానంద: మొదటి వీకెండ్లో నెమ్మదిగా ఉన్న అవసరాల శ్రీనివాస్ జ్యో అచ్యుతానందకు.. వీక్ డేస్ లో మంచి టాక్ స్ప్రెడ్ అయింది. ఈ ఎఫెక్ట్ రెండో వీకెండ్ లో స్పష్టంగా కనిపించింది. యూఎస్ లో అయితే.. ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్కును కూడా దాటేయడం విశేషం.

3. ఇంకొక్కడు: విక్రమ్ ఇంకొక్కడు చిత్రానికి మౌత్ టాక్ బాగోకపోయినా.. మాస్ ఆడియన్స్ కు బాగానే కనెక్ట్ అయింది. ముఖ్యంగా హిజ్రా పాత్ర ఈ మూవీకి ప్రాణంగా నిలవగా.. చాలా ఏరియాల్లో సేఫ్ ప్రాజెక్టుగా మారచ్చంటున్నారు.

4. నిర్మలా కాన్వెంట్: శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించి.. నటించడంతో భారీ ఓపెనింగ్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. ఈ విషయంలో ఫెయిల్ అయిన నిర్మలా కాన్వెంట్.. టాక్ విషయంలోనూ విఫలం కావడంతో.. రిజల్ట్ తేడా వచ్చేస్తోంది.

5. సిద్ధార్ధ: బుల్లితెర హీరో సాగర్.. వెండితెరపై మాస్ హీరోగా చేసిన ప్రయత్నానికి ఆడియన్స్ నుంచి సపోర్ట్ లభించలేదు. మౌత్ టాక్ కాదు కదా.. ఇండస్ట్రీ టాక్ కూడా ఎంకరేజింగ్ గా లేదు. ఈ సినిమా పుంజుకుంటేనే పెద్ద రికార్డ్ అని చెబుతున్నారు ట్రేడ్ జనాలు.

,  ,  ,  ,  ,