Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Feb-2017 10:21:14
facebook Twitter Googleplus
Photo

సినీ తారల ప్రేమ వ్యవహారం ఈజీగా బయటపడిపోతుంది. ఒక హీరో... మరో హీరోయిన్ కాస్త కలివిడిగా ఉన్నారని తెలిస్తే చాలు.. మీడియా కోడై కూసేస్తుంది. వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్లకంటే ముందుగానే బయటకి తెలిసిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ల ముందు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచడం సాధ్యమయ్యే పనేనా చెప్పండీ..! కానీ సమంత నాగ చైతన్యలు మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఓ ఏడాదిపాటు ఎవ్వరికీ తెలియకుండా బాగానే రహస్యంగా నడిపారట. ముఖ్యంగా తన ఇంట్లో వాళ్ల ముందు బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారని నాగార్జున అంటున్నారు.

?మనం? సినిమాలో తామంతా కలిసి నటించామనీ కానీ వీళ్ల ప్రేమను నేను గుర్తించలేకపోయానని నాగార్జున అంటున్నారు. ప్రేమ విషయం నాన్నగారి దగ్గర ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఉండేవారని అన్నారు. తాను సమంతతో కూర్చుని మాట్లాడుతుంటే చైతూ దగ్గరకి వచ్చేవాడు కాదనీ చైతూ తన పక్కన ఉన్నప్పుడు సమంత వచ్చేది కాదని నాగ్ అంటున్నారు. అంతేకాదు... అందరూ కలిసి నటించే సన్నివేశాల్లో కూడా ఇద్దరూ ఎవరికి వారు అన్నట్టుగా ఉండేవారనీ ముఖ్యంగా నాన్నగారితో మేమంతా కలిసి నటించిన సీన్లలో ఇంకాస్త కేర్ ఫుల్గా ఉండేవారని నాగ్ చెప్పారు.

'మనం' సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలో తాను - శ్రియ - చైతు - సమంత - నాన్నగారు - అఖిల్ అందరం ఉన్నామనీ అనుకోకుండా ఇప్పుడు మా అఖిల్ చేసుకోబోతున్న అమ్మాయి పేరు శ్రియ అయిందని నాగ్ సరదాగా చెప్పారు. అలా ఫ్యామిలీ అంతా ఆ ఫ్రేమ్ లోకి వచ్చినట్టయిందన్నారు. చైతూ కోసం అమ్మాయిల్ని వెతికే కష్టం తనకు తగ్గిందనీ వాడు ఇష్టపడ్డ అమ్మాయితో పెళ్లి కుదరడం చాలా సంతోషంగా ఉందని నాగ్ చెబుతున్నారు. మొత్తానికి.. ఈ ఇద్దరూ బాగానే ప్రేమకథను నడిపినట్టే!

,  ,  ,  ,  ,  ,