Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2015 16:56:54
facebook Twitter Googleplus
Photo

ఒక స్టార్ హీరో సినిమాని మరో స్టార్ హీరో పొగిడేయడం అనేది వేరొక హీరో సినిమాకి తనవంతు మోరల్ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం. కానీ ఈ రెండు సందర్భాల్లో ప్రిన్స్ మహేష్ ది గ్రేట్ అనిపించాడు. అప్పట్లో పవన్ కల్యాణ్ నటించిన జల్సా సినిమాకి వాయిస్ ఇచ్చి హీరోలంతా స్నేహితులే అని అభిమానుల్లోకి సందేశం పంపించాడు.

ఇటీవలి కాలంలో బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ సినీయవనికపై గౌరవాన్ని పెంచింది. ఈ సినిమాకి బాసటగా నిలుస్తూ శ్రీమంతుడుని వాయిదా వేసుకున్నాడు. అది మహేష్ మంచి మనసును మరోసారి బైటి ప్రపంచానికి ఆవిష్కరించింది. ఇప్పుడు అలాంటి పనులే కాదు '10కె రన్' వంటి మారథాన్ పరుగుకి కూడా తనవంతుగా సహకారం అందిస్తున్నాడు. లాగాఫ్ షట్ డౌన్ రన్ వేలమంది జాయిన్ అవ్వండి.. మారథాన్ లో పాల్గొనండి.. 30వ తేదీన పరుగుకు రండి.. అంటూ పిలుపునిచ్చాడు.

ఇవన్నీ మహేష్ని సిసలైన శ్రీమంతుడిని చేశాయంటే అతిశయోక్తి కాదు. ఎంత సంపాదించాం అన్నది కాదన్నయ్యా.. ఎంత మంచి పేరు తెచ్చుకున్నాం అన్నది కూడా ముఖ్యమే.

,  ,  ,