Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2016 15:26:07
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగార్జున కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. దర్శకులను గానీ... నటీనటులను గానీ.. ఆయన లాంఛ్ చేశారంటే తిరుగుండదు. గతంలో కూడా ఆయన తన బ్యానర్లో చాలా మంది నటీనటులు.. దర్శకులను ప్రోత్సహించి వారి ఉజ్వ్జల భవిష్యత్తుకు బాటలు వేశారు. కొన్ని సార్లు అవి సరైన ఫలితాన్ని ఇవ్వకపోయినా... ఎక్కడా నిరుత్సాహ పడకుండా తన పనేదో తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తాజాగా హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్.. హీరోయిన్ శ్రేయా శర్మను వెండితెరకు పరిచయం చేశాడు. ఇందులో లీడ్ రోల్ పోషించిన రోషన్ పాత్రను ప్రేక్షకులు అభినందిస్తున్నారు.

ముఖ్యంగా శ్రీకాంత్ తనయుడు రోషన్ కి ఈ సినిమా బెస్ట్ లాంఛింగ్ అంటున్నారు. కథ..కథనాలతో సంబంధం లేకుండా దర్శకుడు ఏం చెబితే అది చేసి రోషన్... తనకు సినిమా మీద ఎంత ప్యాషనో నిరూపించుకున్నాడని అంటున్నారు. ఆడియో వేడుకలో నాగార్జునతో సహా... అక్కడ ఆసీనులైన అందరి మన్ననలను అందుకున్న రోషన్.. సినిమాలో కూడా ఎక్కడా తడబాటు లేకుండా చాలా మెచ్యూర్ గా నటించి మెప్పించాడు. ఈ విషయాన్ని సినీ విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. అలానే రోషన్ కూడా... నాగార్జునతో కలిసి నటించిన సీన్లు చాలా ఫ్రెష్ గా వుండటంతో ప్రేక్షకులు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సినిమాకోసం.. నాగార్జున చాలా కేర్ తీసుకున్నారు. మూవీ మేకింగ్ నుంచి విడుదల తేదీ వరకు చాలా జాగ్రత్తలు పాటించి విడుదల చేశారు. ఇందులో ఓ పాటను పాడటం కూడా నాగ్ అభిమానులకు ఎంతో కిక్ ను ఇస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. లాంగ్ రన్ లో మాత్రం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. ఈ వారం విడుదలైన మిగతా సినిమాలన్నీ బోల్తాపడటమే దీనికి కారణం అంటున్నారు

,  ,  ,  ,  ,  ,