Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Dec-2017 11:11:09
facebook Twitter Googleplus
Photo

సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి. కథ ఎంత బావున్నా కూడా ఒక్కోసారి తెరపైకి వచ్చేసరికి అనుకున్నదంతా తారుమారవుతుంది. ఊహించిన అవుట్ ఫుట్ ఒక్కోసారి బాగా రాకపోవచ్చు. కానీ ఏ దర్శకనిర్మాత కావాలని ప్లాప్ సినిమాను తెరకెక్కించరు అనేది వాస్తవం. అయితే ఒక కథను జడ్జ్ చేసేవారు ఒక్కోసారి సక్సెస్ అవుతుంటారు. సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా నాగార్జున ప్రస్తుతం ఈ విషయంలో హాట్ టాపిక్ అవుతున్నారు.

అయన కెరీర్ కన్నా ఈ మధ్య తనయుల కెరీర్ గురించి చాలా ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అయన జడ్జ్ చేసి ముందుండి నడిపించిన తన కుమారుల కథలు సక్సెస్ అయ్యాయని అనే భావనతో ఉన్నారు. అది నిజమే అనుకోండి. కాకపోతే ఫెయిల్ అయితే మాత్రం నాగ్ దర్శక నిర్మాతల పనితనంపై నెగిటివ్ గా ఆలోచిస్తున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది. నాగ్ గతంలో భాయ్ సినిమా తీసినప్పుడు రిజల్ట్ లో తేడా రావడంతో దర్శకుడైన వీరభద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక అఖిల్ మొదటి సినిమాను వివి.వినాయక్ - నిఖిల్ చేతిలో పెట్టగా ఆ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాతో నిఖిల్ దాదాపు 40 కోట్లు పోగొట్టుకున్నాడు. కానీ నాగ్ వారి ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా కేవలం తప్పు వారిదే అన్నట్లుగా.. హలో ఆడియో వేడుకలో చెప్పకనే చెప్పేశాడు. ఇక హలో సినిమానే అఖిల్ మొదటి సినిమా అని.. ఎక్కడా తగ్గకుండా సినిమాను తెరకెక్కించాం.. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.

,  ,  ,  ,  ,  ,  ,