Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Feb-2016 14:35:26
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మొదటిసారిగా రెండు పనులు చేస్తున్నానని చెబ్తున్నాడు. తన జీవితంలో ఇప్పటివరకూ చేయని పనులు ఇప్పుడు ఊపిరి మూవీ కోసం చేయాల్సి వస్తోందన్నాడు నాగ్. ఒకటి రెండు చేతులు - రెండు కాళ్లు పడిపోయి కుర్చీకే పరిమితమైన కేరక్టర్ చేయడమైతే.. రెండోది తమిళ వెర్షన్ తోఝా కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పడం.

తమిళ్ ఆడియన్స్ కు నచ్చేలా అక్కడి యాసతో డబ్బింగ్ చెప్పడం వీలవుతుందా అని ఆలోచించాడట. అయితే కార్తీ మాత్రం నాగార్జునే డబ్బింగ్ చెప్పాలని పట్టుబట్టాడని అన్నాడు. 'డైరెక్టర్ - కార్తిలకు నేను ముందే చెప్పాను. తమిళ్ వెర్షన్ కి నా వాయిస్ సూట్ అవుతుందో కాదో చెక్ చేసుకోమన్నాను. కానీ కార్తి మాత్రం సొంత వాయిస్ తో డబ్బింగ్ చెబితే కేరక్టర్ జనాల్లోకి పర్ఫెక్ట్ వెళుతుందని అన్నాడు. డెప్త్ ఉండే స్టోరీ కావడంతో సినిమాకి ఇది చాలా అవసరం అని కూడా కార్తి అన్నాడ'ని చెప్పాడు నాగార్జున.

ఊపిరి ప్రమోషన్స్ లో భాగంగా నాగ్ మరిన్ని సంగతులు పంచుకుంటున్నాడు. ఇప్పటికీ మన్మథుడిలా మెరిసిపోతున్నారంటే.. 'అమ్మాయిలకు నచ్చేలా ఉండాలని కోరుకోని మగవాళ్లు ఎవరుంటారు చెప్పండి' అంటూ నవ్వేస్తున్నాడు. అమలతో సినిమా చేస్తారా అంటే.. సరైన స్టోరీ దొరికితే మాత్రం తప్పకుండా నటిస్తానన్నాడు నాగార్జున.

,  ,  ,  ,  ,