Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jul-2016 11:52:31
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌ చేవెళ్ళ పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు వివి వినాయక్ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్టెనర్ గా తీర్చి దిద్దుతున్నారు. ముఖ్యంగా సినిమాలో కామెడీకి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్టు సిద్ధం చేసారు. సినిమాలో వెన్నెల కిషోర్, అలీ లాంటి స్టార్ కమెడియన్లతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబును కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే అతడిపై టెస్ట్ షూట్ చేసారని, తాను అనుకున్న పాత్రకు సంపూ సరిపోవడంతో వినాయక్ అతన్ని కూడా చిరంజీవి 150వ సినిమాలో భాగం చేసారని, త్వరలోనే షూటింగులో సంపూ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయం ఇంకా అపీషియల్ గా ఖరారు కాలేదు. చిరంజీవితో నటించే అవకాశం దక్కాలని సంపూ ఎప్పటి నుండో ఆశ పడుతున్నాడు. ఇపుడు ఆ అవకాశం దక్కడంతో అదృష్టంగా ఫీలవుతున్నాడట. కాగా ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఎవరనేది ఖరారు కాలేదు. సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని సమాచారం. కేవలం పాటలు, కొన్ని సీన్లకే హీరోయిన్ ఉంటుందట. అందుకే స్టార్ హీరోయిన్లు సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదట. పైగా చిరు లాంటి ఏజ్డ్ స్టార్ తో చేస్తే ఫాంలో ఉన్న యంగ్ హీరోలతో అవకాశాలు తగ్గిపోతాయనే భయంలో ఉన్నారట. హీరోయిన్ దొరకని సమస్య కారణంగానే ఇందుకు సంబంధించిన సీన్లు చివరి షెడ్యూల్ లో ప్లాన్ చేసారు. ఈలోగా మిగతా షెడ్యూల్ పూర్తి చేస్తూ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,