Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Feb-2017 11:40:42
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగార్జున మూవీ ఓం నమో వేంకటేశాయ రిలీజ్ కి రెడీ అయింది. ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ కోసం.. ప్రస్తుతం నాగార్జున ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇంటర్వ్యూలు ఇస్తూ.. కొత్త పాత సంగతులు అన్నీ చెబుతున్నాడు. గతంలో చేసిన భక్తి చిత్రం షిరిడి సాయి గురించి కూడా రియాక్ట్ అయ్యాడు నాగ్.

షిరిడిసాయిని డాక్యుమెంటరీలా చిత్రీకరించడం.. ఆమూవీకి లోటు అని ఇప్పటికే అంగీకరించిన నాగ్.. ఈ సినిమాపై క్రిటిక్స్ కామెంట్స్ పై కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యాడు. 'కొంతమంది క్రిటిక్స్.. ఈ సినిమాకు నిర్మాణ విలువలు అంతగా పాటించలేదు అని కామెంట్స్ చేశారు. ఇంతకీ అసలు వాళ్లకేం కావాలి? మేం సాయిబాబా ఎలాంటి దుస్తుల్లో కనిపించాడో అవే చూపించాం. షిరిడి సాయిని కలర్ ఫుల్ డ్రస్సుల్లో చూపించాలా? అలాగే అక్కడి ప్రాంతాన్ని యథాతథంగా రీక్రియేట్ చేశాం అన్న నాగార్జున ఆ తర్వాత తన కామెంట్స్ లో మరింత డోస్ పెంచాడు.

'షిరిడి సాయి సినిమాలో ఓ హీరోయిన్ ని.. కొన్ని డ్యూయెట్స్ ని చేరిస్తే.. అప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నట్లా' అంటూ నిలదీశాడు నాగ్. నిర్మాణ విలువలు అంటూ నాగ్ డోస్ కాస్త గట్టిగానే ఉంది. పేరున్న ఆర్టిస్టులనే తీసుకుంటూ బాగానే తెరకెక్కించినా.. ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ చిత్రంలో హథీరాం బాబాగా నటించిన నాగార్జున.. సినిమాలో అన్ని హంగులు ఉండేలా జాగ్రత్త పడ్డామని చెప్పాడు.

,  ,  ,  ,  ,