Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2016 17:35:32
facebook Twitter Googleplus
Photo

ఎనీ డౌట్.. యాభై కోట్ల వసూళ్లు.. ఇప్పటివరకూ స్టార్ హీరోలకు ఇదో భయంకరమైన టార్గెట్. ఆ రేంజ్ అందుకోకపోతే స్టార్ హీరో అనరేమో రేంజ్ తగ్గిపోయిందేమో అనుకుంటారనే డౌట్స్. అయితే.. ఈ టార్గెట్ కేవలం కుర్ర స్టార్లకు మాత్రమే. సీనియర్లు ఆ దరిదాపుల్లోకి కూడా వచ్చే ఛాన్సులు లేవని అంతా అనుకున్నారు.

ఒకవేళ వచ్చినా బాలయ్యకి తప్ప మరో సీనియర్ హీరోకి కష్టమే అని భావించారు. రీఎంట్రీ ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి చెప్పినపుడు కూడా.. ఫస్ట్ గుర్తొచ్చిన టార్గెట్ ఈ యాభై కోట్లే. ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ లకు 50 కోట్ల సినిమాలు ఉన్నపుడు.. మరి చిరు ఆ మార్క్ అందుకోకపోతే కష్టం అన్నారు. ఇక మరో సీనియర్ హీరో వెంకటేష్ కి ఈ లక్ష్యాన్ని అందుకోవడం కష్టమే అని తేల్చేశారు. నాగ్ కూడా సైలెంట్ గా తన సినిమాలు తాను చేసుకుంటూ.. ఐదారొందల థియేటర్లలో రిలీజ్ లతో సరిపెట్టేస్తారు. అలాంటిది ఒక్కసారిగా యాభై కోట్ల మార్క్ ను ఎవరూ ఊహించని రేంజ్ లో నాగ్ దక్కించేసుకున్నాడు. నాలుగు వారాల్లోనే 50 కోట్ల మార్క్ అందుకున్న సోగ్గాడే చిన్ని నాయన.. ఇంకా వసూళ్ల ఒరవడి కంటిన్యూ చేస్తోంది.

మరిప్పుడు సీనియర్ హీరోల్లో కింగ్ తానే అని ఈ బ్లాక్ బస్టర్ తో ప్రూవ్ చేసుకున్న నాగ్.. మిగిలిన హీరోలకు ఓ రకంగా సవాల్ విసిరారనే చెప్పాలి. ఇప్పుడు బాలకృష్ణ వందో సినిమాకి ఖచ్చితంగా టార్గెట్ ఇదే ఉంటుంది. చిరు రీఎంట్రీ మూవీకి కూడా మినిమం టార్గెట్ ఇదే. మారుతీ-వెంకీ కాంబినేషన్ లో రానున్న బాబు బంగారం కూడా.. ఈ మార్క్ ను అందుకోవాలనే లక్ష్యం ఉంటుంది. మరి సీనియర్లలో నాగ్ రికార్డును అధిగమించేదెవరో.

,  ,  ,  ,  ,