Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Aug-2016 11:08:46
facebook Twitter Googleplus
Photo

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ప్రేమమ్. మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లోనే గాక ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా చైతు కెరీర్లో భారీ విజయంగా నిలుస్తుందని అంటున్నారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు.
ఆ పాత్రకు సంబందించిన షూటింగ్ ను నాగ్ ఈరోజు నుండే మొదలుపెట్టారట. అలాగే దర్శకుడు చందూ మొండేటి నాగార్జున పాత్రను స్పెషల్ గా డిజైన్ చేశారని, ప్రేక్షకులకు, అభిమానులకు ఈ పాత్ర తప్పక నచ్చుతుందని కూడా తెలుస్తోంది. శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది.

,  ,  ,  ,  ,