Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Dec-2017 13:30:51
facebook Twitter Googleplus
Photo

నాని హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ఎంసీఏ. మిడిల్ క్లాస్ అబ్బాయి కథతో అటు సెంటిమెంట్ ను.. ఇటు లవ్ స్టోరీని మిక్స్ చేసి మూవీని రూపొందించారు. ఈ సినిమాతో గత దశాబ్దపు స్టార్ హీరోయిన్ భూమిక.. కొత్త తరహా పాత్రలతో టాలీవుడ్ లో స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఎంసీఏ చిత్రంలో భూమిక అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. నాని క్యారెక్టర్ కు వదిన పాత్రలో ఈమె నటిస్తోందనే విషయాన్ని ఇప్పటికే నిర్మాత దిల్ రాజు రివీల్ చేసేశారు. వదిన -మరిది మధ్య జరిగే ఘర్షణను దర్శకుడు వేణు తెరకెక్కించిన విధానం ఆకట్టుకుందని కూడా చెప్పారు నిర్మాత. ఇప్పుడీ పాత్రకు సంబంధించిన లుక్స్ ను రివీల్ చేశారు. భూమిక సీన్స్ కు సంబంధించిన పోస్టర్స్ ను విడుదల చేయగా.. ఒకదాంట్లో రాజీవ్ కనకాల దండలు మార్చుకునే సీన్ చూపించారు. ఇందులో హీరో నాని.. హీరోయిన్ సాయిపల్లవిలు డ్యాన్స్ చేస్తుంటారు.

మరో పోస్టర్ లో సీరియస్ గా ఉన్న భూమిక వెనుక.. అంతకంటే సీరియస్ గా ఉన్న నాని నడుస్తుంటాడు. రెండు పోస్టర్లు సూపర్బ్ గా ఉన్నాయి. గతంలో హీరోయిన్ గా ఎలాంటి లుక్ లో ఉందో అదే ఫిజిక్ మెయింటెయిన్ చేస్తున్నా.. తన ట్యాలెంట్ తో పాటు మెచ్యూరిటీని కూడా కలగలుపుతోంది భూమిక.

,  ,  ,  ,  ,