అక్కినేని నాగచైతన్య- సమంతల నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులతో.. ఎంతో వైభవంగా ఈ వేడుక నిర్వహించారు. అక్కినేని వారసుడికి స్టార్ హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ అంటే.. ఫోటోగ్రాఫర్లు తమ కెమేరాలకు పని చెప్పాల్సిందే.
ఇప్పటికే నెట్ లో బోలెడన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నా.. వీటన్నిటిలోకీ సమంత మామగారైన అక్కినేని నాగార్జున షేర్ చేస్తున్న ఫోటోలు టాప్ రేంజ్ లో ఉంటున్నాయి. చెయ్-శామ్ ల ఎంగేజ్మెంట్ లో ఫంక్షన్ లోంచి బెస్ట్ అనిపించే పిక్చర్స్ ను ఏరికోరి మరీ షేర్ చేస్తున్నారు నాగార్జున. తాజాగా తనకు నచ్చిన ఫోటో ఇదే అంటూ చైతు సమంతలు అత్యంత సన్నిహితంగా ఉండి పోజ్ ఇచ్చిన ఫోటో ఒకటి ట్వీట్ చేశారు నాగ్. ఇందులో ఈ జంట ఒకరినొకరు పట్టుకుని ఉంటే.. గుండెల దగ్గర నుంచి పైకి మధ్యలో ఖాళీ కనిపిస్తుంది. చివరకు వీరిద్దరు తమ ముక్కులను ఆనించి పోజ్ ఇచ్చిన ఈ ఫోటోను జాగ్రత్తగా చూస్తే.. మధ్యలో లవ్ సింబల్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ప్రేమ జంట తమ బంధాన్ని చెప్పడానికి ఇంత కంటే సింపుల్ పోజ్ ఏముంటుంది ? అందుకే టాలీవుడ్ మన్మధుడు నాగ్ కి కూడా ఈ ఫోటో తెగ నచ్చేసిందన్న మాట