Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2016 13:07:36
facebook Twitter Googleplus
Photo

యంగ్ హీరో నితిన్ అ..ఆ.. లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నితిన్ కి కెరీర్ బెస్ట్. మరి ఈ రేంజ్ కు తగ్గట్లుగానే నెక్ట్స్ మూవీ ఉండాలన్నది ఈ కుర్ర హీరో ఆలోచన. అందుకే.. తన తర్వాతి సినిమాలో కూడా స్టార్ హీరోయిన్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు.

సాధారణంగా హీరోయిన్ విషయంలో పెద్ద చిన్న అనే తేడాలని నితిన్ పట్టించుకోడు కానీ.. ఓ హీరోయిన్ మూవీకి ఎంత అడ్వాంటేజ్ అవుతుందో అ..ఆ..తో బాగానే క్యాచ్ చేసిన నితిన్.. ఇప్పుడు కొత్త సినిమా కోసం శృతి హాసన్ ను అడుగుతున్నాడట. హను రాఘవపూడి డైరెక్షన్ లో ఇప్పటికే మూవీ కన్ఫామ్ కాగా.. త్వరలో సెట్స్ పైకి కూడా వెళ్లనున్నారు. రీసెంట్ గా శృతిని అడగడం జరిగినా.. ఆమె నుంచి ఇంకా క్లారిటీ రాలేదు.

శృతి హాసన్ తో సినిమా విషయంలో.. నితిన్ కొన్ని ఏళ్లుగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. హను రాఘవపూడి చిత్రం కన్ఫాం కాకముందు గుండె జారి గల్లంతయ్యిందే సీక్వెల్ తీస్తారనే టాక్ ఉన్నపుడు కూడా శృతి పేరే వినిపించింది. కొత్త కాంబినేషన్ విషయంలో పట్టుదలగా ఉన్న.. ఈ సారి మాత్రం శృతి హాసన్ తో సినిమా ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,