Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Oct-2017 12:37:21
facebook Twitter Googleplus
Photo

మన్మధుడు అంటే ఎవరో అందరికి తెలుసు. వయసుతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తూ.. అన్ని వర్గలు ప్రేక్షకులను ఆకట్టుకునే వారిలో నాగ్ ఒకరు. తనకు కథ నచ్చితే చిత్ర యూనిట్ పెద్దదా చిన్నదా అని నాగ్ ఎప్పుడు చూడరు. టాలెంట్ ని గుర్తించే స్టార్ హీరోల్లో నాగ్ ఎప్పుడూ ముందుంటారనే చెప్పాలి. అన్ని తరహా ప్రయోగ పాత్రలను చేసిన నాగ్ అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు.

అయితే ఇటీవల నాగ్ ముఖ్య పాత్రలో చేసిన రాజు గారి గది 2 సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా కొంతమంది లేడి ఫ్యాన్స్ ను ఆయన కలిశారు. నాగార్జున కి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. అయితే అక్కడ నాగ్ కి అనేక ప్రశంసలు అందాయి. సినిమాలో మామా కోడళ్లు చాలా అద్భుతంగా నటించారని అక్కినేని ఫ్యామిలీ అంటేనే సూపర్బ్ అనేలా మహిళలు పొగిడేశారు. ముఖ్యంగా సినిమాలో సమంత చేసిన పాత్ర చాలా బావుందని మీరు చెప్పిన డైలాగ్స్ కూడా హార్ట్ కి టచ్ అయ్యేలా ఉన్నాయని లేడి ఫ్యాన్స్ చెప్పారు.

అదే విధంగా తనకు లేడీస్ అంటే ఎప్పుడు గౌరవేమనని చెబుతూ .. యూత్ కి టీనేజ్ కి మంచి మెస్సేజ్ ఇచ్చే సినిమాలను కూడా అభిమానుల కోరిక మేరకు నాగ్ చేస్తానని చెప్పారు. ఇక ఎమ్ ఎమ్ ఎస్ అలాగే ఏదైనా వీడియో లీక్స్ అయితే ఒక అమ్మాయి పరిస్థితి ఏంటని ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంటుందని అలాంటివి జరగకుండా ఉండాలని నాగ్ చెప్పాడు.

మాటల రచయిత అబ్బూరి రవి కూడా నాగ్ చాలా ఇష్టపడి డైలాగ్స్ చెప్పారని చెప్పాడు. ఆయన కోరడంతోనే తను అలాంటి డైలాగ్స్ రాయగలిగాను అని రవి వివరించాడు.

,  ,  ,  ,  ,