Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Dec-2017 13:04:07
facebook Twitter Googleplus
Photo

కుమార్-అక్కినేని అఖిల్ కాంబినేషన్లో సినిమా మొదలైనప్పట్నుంచి.. దీనిపై పాజిటివ్ బజ్ ఉంది ప్రేక్షకుల్లో. దీని టైటిల్.. ఫస్ట్ లుక్.. టీజర్.. అన్నీ పాజిటివ్ ఫీలింగే ఇచ్చాయి జనాలకు. ఐతే అంతా బాగుందనుకుంటున్న తరుణంలో హలో టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కాపీ రైట్ వివాదం తలెత్తింది. ఈ టీజర్ ను యూట్యూబ్ నుంచి తొలగించేయడం సంచలనం సృష్టించింది. ఐతే కొన్ని గంటల్లో మళ్లీ టీజర్ యూట్యూబ్ లోకి వచ్చింది. దీనిపై అఖిల్ ఏదో వివరణ ఇచ్చాడు కానీ.. జనాలకు ఫుల్ క్లారిటీ రాలేదు. ఇప్పుడు నాగార్జున స్వయంగా ఈ గొడవపై స్పందించాడు.

హలో టీజర్ టైంలో అనూప్ బిజీగా ఉన్నాడని.. టీజర్ ఎడిటింగ్.. బ్యాగ్రౌండ్ స్కోర్ వేరే వాళ్లతో చేయించుకోవడం సహజమే అని.. తాము ముంబయి వాళ్లకు ఈ బాధ్యత అప్పగించగా.. వాళ్లు ఓ హంకాంగ్ కంపెనీ నుంచి స్కోర్ తీసుకున్నారని.. వాళ్లకు హాలీవుడ్ కంపెనీతో కాంట్రాక్ట్ ఉందని తెలిపాడు. యూట్యూబ్ వాళ్లు తమ టీజర్ తొలగించే సమయానికి కాంట్రాక్టు సంస్థకు చెందిన వాళ్లు నిద్రపోతున్నారని.. వాళ్లు లేచి ఈ ఇష్యూను సార్ట్ ఔట్ చేయడానికి సమయం పట్టిందని.. అందుకే ఆరు గంటల తర్వాత టీజర్ మళ్లీ అప్ లోడ్ చేశామని నాగ్ వివరించాడు.

,  ,  ,  ,  ,