Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jun-2017 12:57:52
facebook Twitter Googleplus
Photo

రా రండోయ్ వేడుక చూద్దాం మూవీ భారీ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. అక్కినేని నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే మొదటి వారం కలెక్షన్స్ లో రికార్డ్ సృష్టించిన ఈ మూవీ రేంజ్ ను మరింతగా పెంచే పనిలో తెగ యాక్టివ్ గా ఉన్నారు నిర్మాత నాగార్జున.

సహజంగా కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయితే.. అందుకు తగ్గ థీమ్స్ తో వేడుకలను నిర్వహించేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కల్చర్ మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రారండోయ్... వేడుక చూద్దాం.. ఈరెండు పదాల మధ్యలో కళ్యాణ వేడుకను జత చేసి ఓ వివాహానికి సంబంధించిన ఫ్లెక్సీ తయారు చేశారు. ఈ కాన్సెప్ట్ ను జనాలు కూడా బాగానే మెచ్చుకోగా.. అదే పోస్టర్ ను నాగార్జున స్వయంగా పోస్ట్ చేసేయడం విశేషం. ఆ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫ్లెక్సీ ఫోటోను షేర్ చేసిన నాగ్.. బాగుందని చెప్పడంతో పాటు అభినందనలు కూడా తెలియచేశారు.

ఒకవైపు ఆ పెళ్లి జంటకు కంగ్రాచ్యులేషన్స్ చెబుతూనే.. మరోవైపు థియేటర్స్ లో ఉన్న తన కుమారుడ చిత్రానికి ప్రచారం చేసుకోవడం చూస్తే.. నాగార్జున ఎంత యాక్టివ్ అనే విషయం ఈజీగా అర్ధమైపోతుంది.

,  ,  ,  ,  ,