Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2015 11:11:52
facebook Twitter Googleplus
Photo

సోగ్గాడే చిన్ని నాయన .... ఈ టైటిల్ వినగానే ఇందులో వినోదం పాలు ఎక్కువుంటుందన్న విషయాన్ని ఎవరైనా సరే చెప్పేస్తారు. మనం అనుకున్నట్టుగానే అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎంటర్ టైన్మెంట్ ప్రధానాంశం. ఇందులో నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒకటి తాత పాత్ర ... మరొకటి మనవడి పాత్ర. తాత పాత్రను శృంగార పురుషుడిగా తీర్చిదిద్దుతున్నారట. ఆ క్యారెక్టర్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా ... మనవడి పాత్ర పక్కన లావణ్య త్రిపాఠీ నటిస్తోంది. నూతన దర్శకుడు కల్యాణ్ కృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రం మేజర్ షెడ్యూల్ ఆ మధ్య మైసూర్ పరిసరాల్లో జరిగింది. తాజా షెడ్యూలును జూన్ ఒకటి నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంచితే, తమిళ హీరో కార్తీతో కలసి నాగార్జున మరోపక్క మల్టీ స్టారర్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి విదితమే!

,  ,  ,  ,