Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Dec-2016 12:16:44
facebook Twitter Googleplus
Photo

చేసే ప్రతీ పాత్రా తనకు తన కెరీర్ కు ఎలాగైనా మేలు కలిగించాలన్న ఉద్దేశంతో సినిమాలను ఎంపిక చేసుకునే నటుడు రానా. ఇక చేసేవి సహాయకపాత్రలా - హీరోటిక్ రోల్సా అన్న ఆలోచనలేకుండా తన పాత్రకు పూర్తిన్యాయం చేసేవాడు నవదీప్. ఇప్పుడీ ఇద్దరు హీరోలు కమ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ లు కలిపి ఒక ఈవెంట్ ని హోస్ట్ చెయ్యనున్నారు. దాని సంగతేంటో చూద్దామా?

ఆడియో రిలీజ్ లతో పెద్ద ప్రభావం వుండడంలేదని ఆడియోని డైరెక్ట్ గా మార్కెట్ లోకి వదిలేసి విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఏర్పాటు చెయ్యడం అలవరుచుకున్నారు మెగా హీరోలు. ఇప్పుడు చిరు నటిస్తున్న ఖైదీ నెంబర్ 150కి సైతం ఇదే పద్ధతిని ఫాలో అవ్వనున్నారు.

ఈ ఈవెంట్ జనవరి 4న జరగనుంది. దీనికి రానా - నవదీప్ లు హోస్ట్ లుగా కనిపించనున్నట్టు సమాచారం. తమ ఫ్యామిలీల మధ్యనున్న అనుబంధంకారణంగా రానా ధృవ సినిమాతో మంచి రోల్ అందుకున్న నవదీప్ కృతజ్ఞతగా ఈ ఈవెంట్ ని హ్యాండిల్ చేయనున్నారు. ఇక చిరు చిందేయనున్న మూడవపాట రేపు సాయింత్రం విడుదలకానున్న విషయం తెలిసినదే. లెట్స్ వెయిట్ అండ్ సీ...

,  ,  ,  ,  ,  ,