Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2016 12:52:22
facebook Twitter Googleplus
Photo

సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ఆడియో లాంచ్ లో కింగ్ నాగార్జున ఒక విషయం స్పష్టం చేశారు. తాను తనకు నచ్చిన దర్శకుడి డైరక్షన్ లో పనిచేయడానికి.. ఎలాంటి రోల్ ఇచ్చినా చేసేయడానికి.. సిద్దంగా ఉన్నారు. అది బాబా రోల్ అవ్వనివ్వండి.. బోల్డ్ గా ఉండే విలన్ రోల్ అవ్వనివ్వండి.. కింగ్ ఈజ్ రెడీ అంతే.

నిజానికి దర్శకుడు గౌతమ్ మీనన్.. ఎప్పుడు కలిసినా కూడా నాగార్జునతో సార్ మీకొక కథ ఉంది అంటున్నాడట. ''మీకొక నెగటివ్ రోల్ ఉంది.. చేస్తారా అని అడుగుతాడు. నేను నీ దర్శకత్వంలో అయితే తప్పకుండా చేస్తానని చెబుతాను. కాని తరువాత మనోడు మాయమైపోతాడు. చైతుతో సినిమా చేస్తాడు. మరి నాతో ఎప్పుడు చేస్తావ్ గౌతమ్?'' అంటున్నాడు కింగ్. ఒకవేళ నిజంగానే గౌతమ్ మీనన్ వచ్చి నెగెటివ్ రోల్ ఉన్న సినిమా ఆఫర్ చేస్తే.. నాగ్ చేసేస్తాడా? ఏమో చేసినా చేసేయొచ్చు.

ఇకపోతే తనతో ఒక్క సినిమా కూడా చేయని గౌతమ్ అప్పుడే చైతన్యతో రెండు సినిమాలు చేసేయడం మాత్రం గ్రేట్ అంటూనే.. సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయంటూ చెప్పుకొచ్చారు నాగార్జున. గతంలో చాలాసార్లు చెప్పినట్లు.. సాహసం అనే పదాన్ని తాను చాలా గట్టిగా నమ్మానని.. అందుకే ఈ సినిమా టైటిల్ అంటే చాలా ఇష్టమని మరోసారి ఆయన స్పష్టం చేశారు.

,  ,  ,  ,  ,  ,  ,