Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Sep-2016 12:25:29
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ దసరా రిలీజ్ లలో ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిస్తున్న సినిమాల్లో ప్రేమమ్ ఒకటి. రీమేక్ మూవీ అయినా సరే.. కాంబినేషన్ల కారణంగా ఈ మూవీకి బోలెడంత బజ్ వచ్చేసింది. నాగ చైతన్య హీరోగా నటించడమే తెలుగు ప్రేమమ్ కి అన్నిటికంటే ప్లస్ అవుతోంది. ప్రస్తుతం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి.. టాలీవుడ్ మన్మథుడి సపోర్ట్ వచ్చేసింది.

రీసెంట్ గా తండ్రి నాగార్జనకు.. స్పెషల్ షో వేయించి మరీ తన ప్రేమమ్ ను చూపించాడు చైతు. సినిమా మొత్తం నాగ్ ఎంజాయ్ చేశారని.. ప్రతీ ఫ్రేమ్ ను ఎంజాయ్ చేస్తూనే ఉన్నారని తెలుస్తోంది. ప్రదర్శన పూర్తవగానే ప్రతీ ఒక్కరినీ అభినందించిన నాగ్.. చైతు ఖాతాలో సూపర్ హిట్ ఖాయమని కామెంట్ చేశారని టాక్. తన సంతోషాన్ని అంతటితో ఆపేయకుండా.. అభమానులతో కూడా పంచుకున్నారు నాగార్జున. 'ఇప్పుడే తెలుగు ప్రేమ్ ను చూసా. చాలా సంతోషంగా ఇంటికి వెళుతున్నా' అంటూ ట్వీట్ పెట్టారు నాగార్జున.

నాగ్ నుంచి వచ్చిన పాజిటివ్ రియాక్షన్ చూశాక.. హీరో నాగ చైతన్య- దర్శకుడు చందూమొండేటిలలో ఉన్న కొద్దిపాటి టెన్షన్ కూడా తొలగిపోయిందని తెలుస్తోంది. ముగ్గురు ముద్దుగుమ్మలతో చైతు ప్రేమమ్.. దసరా సీజన్లో హిట్టు కొట్టడం ఖాయమంటున్నారు సినీ జనాలు.

,  ,  ,  ,  ,