Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 11:04:20
facebook Twitter Googleplus
Photo

బాస్... గుండు బాస్ అంటూ శివాజీలో నున్నటి గుండుతో రజనీకాంత్ హంగామా చేశాడు. అచ్చం అలాంటి గెటప్ లో ఓ సారి మన మన్మథుడు నాగార్జునని ఊహించుకోండి. ఊహిస్తేనే థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది కదూ! మరి నాగ్ అలా కనిపించడానికి ధైర్యం చేస్తాడో లేదో కానీ... ఆ తరహా గెటప్ గురించి ఇప్పుడు చర్చైతే సాగుతోంది. రాజుగారి గదికి సీక్వెల్ గా ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ఆ హారర్ థ్రిల్లర్ కథని నిన్ననే ప్రారంభమైంది. అందులో నాగార్జున ఎలా కనిపించబోతున్నాడన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో నాగార్జున చేస్తున్న ప్రతి సినిమాలోనూ ఓ కొత్త రకమైన గెటప్ కనిపిస్తోంది. అందుకే మీడియా జనాలు కూడా ఉండబట్టలేక నాగ్ ని తన క్యారెక్టర్ గెటప్ గురించి అడిగారు.

``కుర్రాళ్లయితే ఇప్పుడు గెడ్డాలతో కనిపిస్తున్నారు. మరి నేనెలా కనిపించాలన్నది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఓంకార్ మాత్రం కొన్ని స్కెచ్చులేసి పెట్టాడు`` అన్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు నాగ్ ని ఈ సినిమాలో గుండుతో చూపించాలని ఓంకార్ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి నాగ్ అందుకు ఒప్పుకుంటాడా? అన్నది చూడాలి. కథ నచ్చిందంటే నాగ్ కూడా ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారు. ఊపిరిలో వీల్ చైర్ కే పరిమితమైన పాత్రని చేసిన విషయం తెలిసిందే. అభిమానులకి నచ్చుతుందో లేదో అని కూడా ఆయన పెద్దగా ఆలోచించరు. కథ - పాత్రలు బాగుంటే అభిమానులు కూడా కచ్చితంగా సినిమాని ఇష్టపడతారనేది నాగార్జున ఆలోచన.

,  ,  ,  ,  ,  ,