Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2017 12:08:56
facebook Twitter Googleplus
Photo

త్వరలోనే పెళ్ళిచేసుకుని ఒక్కటవ్వనున్నారు హీరో నాగచైతన్య మరియు స్టార్ హీరోయిన్ సమంత. అయితే ఇద్దరూ చాలా అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం ముగించేశారు కాని.. ఇప్పటివరకు ఇంకా పెళ్లి తేదీని మాత్రం ఖరారు చేసుకోలేదు. పోనివ్ ఇద్దరూ హైదరాబాదులోని తమ ఫ్లాటులో కాలక్షేపం చేస్తున్నారా అంటే కాదాయే.

ప్రస్తుతం సమంత గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో సుకుమార్ సినిమా షూటింగులో పాల్గొంటోంది. మండే ఎండలో అమ్మడు రామ్ చరణ్ తో కలసి కష్టపడుతోందంటే చూసుకోండి మరి. ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలను కూడా అమ్మడు లైనప్ లో పెట్టేసింది. సావిత్రి.. రాజుగారి గది 2 ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. ఇక చైతన్య కూడా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్లో రూపొందుతున్న రారండోయ్ వేడుక చూద్దాం సినిమా కోసం హైదరాబాద్ లో కష్టపడుతున్నాడు. ఇండోర్ అండ్ అవుట్ డోర్ షూటింగ్ జరుగుతోంది. ఆ విధంగా ఈ లవ్ బర్డ్స్ ఇద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఆగస్టులో వీరి పెళ్ళి జరగనుందని ఇప్పటికే రూమర్లు వినిపిస్తున్నాయి.

,  ,  ,  ,  ,  ,