Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2017 10:37:44
facebook Twitter Googleplus
Photo

ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటుంది. ఎవరో ఒకరు మొదలుపెడితే.. తర్వాత దాన్ని అందరూ ఫాలో చేసేయడంతో.. కొత్త ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్ ఉంటేవి. ఇప్పుడు సినిమాలు 100 రోజులు ఆడ్డం దాదాపు అసాధ్యం అయిపోవడంతో.. ఆడియో ఫంక్షన్స్ జరిగాయి.

ఇప్పుడు వీటికి కూడా ముగింపు పలికేసి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోకి ట్రెండ్ మార్చేశారు. ఒక్కోపాటను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ.. ఆడియో ఫంక్షన్ మానేసి ప్రీరిలీజ్ ఫంక్షన్ చేయడం అనే ట్రెండ్ ను సరైనోడు మూవీతో అల్లు అర్జున్ స్టార్ట్ చే్స్తే.. తర్వాత మెగా మూవీస్ అన్నిటికీ ఇదే నడిచింది. ఇప్పుడు అక్కినేని హీరో నాగచైతన్య.. తన నెక్ట్స్ మూవీ 'రా రండోయ్ వేడుక చూద్దాం కోసం ఇదే చేస్తున్నాడు'. మే నెల 1న మొత్తం ఆడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేసేస్తారట. ఆడియో ఫంక్షన్ జరపబోవడం లేదని తెలిసింది.

సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రా రండోయ్ వేడుక చూద్దాం మే నెల 19న విడుదల చేయనున్నారు. సరిగ్గా ఆరు రోజుల ముందు అంటే మే 13న ప్రీరిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

,  ,  ,  ,  ,