Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jul-2016 10:23:52
facebook Twitter Googleplus
Photo

అవును.. నేను ప్రేమలో ఉన్నాను' అంటూ సమంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఆ లక్కీ ఫెలో ఎవరా అని అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ ఆరా తీస్తూనే ఉంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాం, పెళ్లికి పెద్దలు కూడా సరే అన్నారంటూ అంతా చెప్పిన శామ్ అసలు విషయం దాచేయడంతో ఊహాగానాలకు అంతు లేకుండా పోయింది. జెస్సీ మనసు దోచిన ఆ కార్తీక్... నాగచైతన్యే అంటూ ఇప్పటికే మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగార్జున కూడా తన ఇద్దరు కుమారుల ప్రేమ, పెళ్లి గురించి ప్రస్తావించడంతో సమంత, నాగచైతన్యల ప్రేమ నిజమేనంటూ టాక్ వచ్చింది.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇద్దరూ కలిసి హైదరాబాద్లోని ఓ షాపింగ్ మాల్లో ఉన్న కేఫ్ వద్ద సమయం గడుపుతున్న ఓ ఫొటో బయటకు వచ్చింది. అంతే.. సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్ అయ్యింది. సమంత ప్రేమ గురించి బయటపెట్టాక చైతన్యతో కలిసి కెమెరా కంట పడటం ఇది రెండోసారి. దీంతో ఎఫైర్ నిజమేనని, త్వరలోనే వీళ్ల పెళ్లవుతుందని ఇరువురి అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ఇక ఏది నిజమో, ఏది అబద్ధమో వాళ్లిద్దరే తేల్చాలి!

,  ,  ,  ,  ,  ,  ,