Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2016 10:45:10
facebook Twitter Googleplus
Photo

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన ఇజం మూవీ ఆడియో లాంఛ్ ఫంక్షన్ లో హైద్రాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. నందమూరి హరికృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ లు ఈ వేడుకకు హాజరుకావడంతో.. మొత్తం ఫంక్షన్ కే నిండుదనం వచ్చేసింది. అయితే.. ఇజం ఆడియో సందర్భంగా.. ప్రకాష్ రాజ్ కొన్ని సంగతులు చెప్పుకొచ్చాడు. జనాలకు తెలిసిన వాటినే తెలియని యాంగిల్ లో చెప్పే పూరీ స్టైల్ లోనే ప్రకాష్ రాజ్ మాటలు ఉండడం విశేషం.

'బ్యాంకాక్ లో తను కొత్తగా చేసినదో ఏదో చూపించడానికి ల్యాప్ టాప్ తీసుకొచ్చినపుడే అనూప్ రూబెన్స్ చూశాను. పూరీ ఒకళ్లను చూశాడంటే.. ఏదో విషయం ఉన్నట్లే. కొత్తవాళ్లతో ఏదో ఓ ప్రయత్నం చేస్తుంటాడు. మనం చూశాక అనూప్ తో మాట్లాడాను.. సాంగ్స్ మాత్రమే కాకుండా.. ప్రతీ సీన్ లోను.. మనకు తెలీకుండా మన వేళ్లు పట్టుకుని తీసుకెళ్తున్నట్లు ఉంటుంది. మళ్లీ రాజా(ఇళయరాజా)గారిని గుర్తు చేశావ్' అంటూ ఇజంకు సంగీతం అందించిన అనూప్ ను పొగిడేశాడు ప్రకాష్ రాజ్.

'కళ్యాణ్.. నాకు ఇతని ఆకలి తెలుస్తోంది.. పూరీ చేతిల్లో పడితే!.. పూరీకి విజన్ ఉంటుంది. నాలాంటి నటుడికి ఒక జిజ్ఞాస ఉంటుంది. నేను నేనుగా ఉంటానంటున్నా.. ఏదో తపన మనసులో ఉంటుంది. పూరీ గెటప్ ఇవ్వడం వేరు.. కానీ కళ్యాణ్ రామ్ ని చూస్తుంటే.. పూరీ తపన కనిపిస్తోంది. కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నాడో ప్రతీ ఒక్కళ్లకీ తెలుసు. తన బ్రదర్ తోనే పోటీ పడుతున్నాడు. నాలాంటి వాళ్లు గర్వించే యాక్టర్ ఎన్టీఆర్. పూరీ ఆకలి తెలుసు. పూరీ విజన్ తెలుసు' అన్నాడు ప్రకాష్ రాజ్.

ఇక పూరీ గురించి మాట్లాడేప్పుడయితే.. ప్రకాష్ రాజ్ లో భావాలన్నీ ప్లెయిన్ గా బయటకు వచ్చేశాయ్. 'జగ్గు.. పల్లెటూళ్లోనే ఉంటూ.. తెలుగుతనం అద్దుతాడు. డక్ అంటే బూతు అన్నాడు. కానీ బూతు కూడా ఎవరి నోట్లో అయినా అందంగా ఉంటే అది పూరీ దగ్గరే. బూతు బూతులా కాకుండా.. అది ఒక భాష అనిపించడం.. అది ఒక ఎక్స్ ప్రెషన్ మాదిరిగా భావాలను స్ఫురించేలా చేయడం పూరీ దగ్గరే తెలుస్తుంది. తెలుగు సినిమా మాస్ కి ఒక క్లాస్ టచ్ ఇస్తాడు' అంటూ పూరీ జగన్నాథ్ గురించి పూరీ స్టైల్ లోనే చెప్పాడు ప్రకాష్ రాజ్.

,  ,  ,  ,  ,